Friday, 20 July 2012

ప్రతి రోజు ఎదురవుతాము
తనకి నేను తెలుసు
నాకు తను తెలుసు
కనులూ  కనులు కలుస్తాయి..
కానీ ఆ చూపుల భావం కలువదు..
ఆ చూపులకు భావం ఏ కవి రాయని కావ్యం.
ఆకాశాన్ని ఎప్పుడూ వీడని నెలవంక లాగా
ఎప్పుడూ ఆ మొహాన్ని వీడని నవ్వుల వెన్నెల
నాకు మాత్రం అమావాస్యనే అందిస్తుంది..
అందరిని ఆదరించే ఆ చేతులు నాకు మాత్రం దూరం అవుతున్నాయి..
మంచు లాంటి ఆ మనసుకి మసి పూసుకుని శిలలా మారింది..
నింగిలాంటి ఆ విశాల హృదయంలో ఏ మూలైన నాకు చోటు ఉంటే
అది ఈ ఎడారి లాంటి మనసుని చిరునవ్వు అనే వర్షపు చినుకుని కురిపించి
నన్ను ఎపుడు మైమరిపింపచేస్తుందో!!!


No comments:

Post a Comment